కొండపి: సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు నవోదయ పాఠశాలలు 6వ తరగతి విద్యార్థి అనుమానస్పద మృతి, ఫర్నిచర్ ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు నవోదయ పాఠశాలలు ఆరవ తరగతి విద్యార్థి అనుమానస్పద మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న తౌషిక్ కుటుంబ సభ్యులు పాఠశాలలోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను వారు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆగ్రహంగా ఉన్న వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.