కొండపి: ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు బకాయి ఉన్న 1800 కోట్లు విడుదల చేశామని అసెంబ్లీలో వెల్లడించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
2026 నాటికి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు రూ.1800 కోట్ల బకాయలను విడుదల చేసినట్లు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గత ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తమ ప్రభుత్వం మాత్రం ముందస్తు జాగ్రత్త తీసుకుంటూ బకాయిలను విడుదల చేస్తూ వచ్చిందని మంత్రి స్వామి అసెంబ్లీలో శుక్రవారం తెలిపారు. అలానే హాస్టల్లో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.