కొండపి: పాకాల బీచ్ ఫెస్టివల్ కు ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నాం: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో జరిగే బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పాకాల బీచ్ ని పరిశీలించి ఏర్పాట్లను మంత్రి స్వామి పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జరిగే కార్యక్రమాలు మరియు ప్రారంభించే కార్యక్రమాల వివరాలు పాల్గొనే వారి ప్రముఖుల వివరాలు తెలిపారు. అధికారులు కూడా ఎక్కడ ఏటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి అన్నారు.