కొండపి: రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుంది: వైయస్ షర్మిల
రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని బిజెపి నిర్వీర్యం చేసిందని పథకం ఊపిరి తీసిందని బిజెపిపై షర్మిల విరుచుకుపడ్డారు. కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.