కొండపి: సింగరాయకొండలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు, కార్యక్రమానికి హాజరైన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్ శనివారం కలెక్టర్ రాజబాబు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామరచర్ల సత్య మరియు ఏపీ టూరిజం శాఖ చైర్మన్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ బెలూన్లు వదిలి కార్యక్రమం ప్రారంభమైనట్లుగా హర్ష త్వరలో మధ్య అధికారులు నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 14 15వ తేదీలలో ఈ ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది.