రాయదుర్గం: ఒకే సీజన్ లో 33 గేట్లు తొలగించి కొత్తవి అమర్చడం రికార్డు : మంత్రి పయ్యావుల కేశవ్
''గో ఆల్ అవుట్'' అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణమని మంత్రి పయ్యవుల కేశవ్ అన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే తో కలసి తుంగభద్ర డ్యాం వద్ద మీడియాతో మాట్లాడారు. ఒక సీజన్ లో డ్యాం 33 గేట్లు తొలగించి, కొత్తవి నిర్మించడం దేశం లోనే ఓ రికార్డు అన్నారు. వచ్చే సీజన్ కి డ్యాం 33 గేట్లు అమరిక పూర్తి అవుతుందన్నారు.