కొణిజర్ల: ఖమ్మం ఆదిత్య థియేటర్ వద్ద ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలోని ఆదిత్య థియేటర్ వద్ద అభిమానులు భారీ సంబరాలు జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు పోస్టర్లు, ఫోటోలతో డ్యాన్స్‌లు చేస్తూ జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో థియేటర్ పరిసరాలు పండుగలా మారాయి.