శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన శ్రావణమాసోత్సవాలు నేటి నుంచి సెప్టెంబర్ 12 వరకు ఉత్సవాలు
శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి సెప్టెంబర్ 12 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రేయింబవళ్లు అఖండ శివభజనలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని వీరశిరోమండపంలో అర్చకులు సంకల్పం, మహాగణపతి పూజ, చండీశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహించి శివప్రణవ పంచాక్షరీ నామభజనను ప్రారంభించారు. కర్నూలుకు చెందిన ఐదు, కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు దేవస్థానం అవకాశం కల్పించింది. శ్రావణమాసం తొలి రోజు కావడంతో స్వామివారి, అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది.