విశాఖపట్నం: విశాఖలో ఇంకుడు గుంతలపై అవగాహన: ప్రతి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ పిలుపు
భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని విశాఖ ఈస్ట్ ఏసీపీ కె.లక్ష్మణమూర్తి సూచించారు. పెదవాల్తేరులో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని వృథా చేయకుండా భూగర్భ జలాలు పెంచేందుకు వినియోగించుకోవాలని కోరారు. అక్టోబర్ నెలలో నగరం అంతటా అవగాహన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.