సిరిసిల్ల: పోలీస్ అధికారులకు శిక్షణ: నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తు ఉండాలి - ఎస్పీ
జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలని ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశించారు. చట్టపరమైన విధానాలు, సాక్ష్యాధారాల సేకరణపై ప్రాసిక్యూటర్లు అవగాహన కల్పించారు.