శ్రీశైలం: నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు. ప్రారంభ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు దంపతులు.
శ్రీశైలంలో కార్తీక మసోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి ఆలయ అర్చకులు, ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీకమాస ఆకాశదీపం వెలిగించారు కార్తీకమాసం ప్రారంభంగా వెలిగించబడిన ఈ ఆకాశదీపం కార్తికమాసం ముగింపు వరకు ప్రతిరోజూ ఈదీపాన్ని వెలిగించడం జరుగుతోంది కార్తీక మాసం ప్రారంభ సూచికగా ఆకాశదీప ప్రజ్వలనకు ముందుగా అర్చకస్వాములు సంకల్పాన్ని పటించి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేసి తర్వాత ప్రధాన ఆలయంలోని ధ్వజస్తంభం పైన ఈ ఆకాశదీపాన్ని నెలకొల్పారు ఈ ఆకాశదీపాన్ని వెలిగించినా, చూసినా సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం