మార్కాపురం: కొనకనమిట్ల మండలం గార్లదిన్నె వెలిగొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో వెలిసిన వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం ప్రాంత అభివృద్ధికి గత ప్రభుత్వంతో పోలిస్తే అన్ని విధాలుగా మరింత ప్రధానత ఇచ్చి ముందుకు సాగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రార్థన ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.