తాడిపత్రి: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే బైక్ ర్యాలీని జయప్రదం చేయండి:తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగ రాగిణి
తాడిపత్రిలో ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జైశ్రీరామ్ భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహించబోయే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ భూమా నాగ రాగిణి కోరారు. తాడిపత్రిలో మంగళవారం ఆమె మాట్లాడారు. శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం వద్ద నుంచి గాంధీ కట్ట వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రతి హిందువు, ఆంజనేయ స్వామి భక్తులు ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.