ఒంగోలు అర్బన్: ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 150 మెడికల్ క్యాంపులు నిర్వహణ
Ongole Urban, Prakasam | Sep 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఒకేసారి 150 మెడికల్ క్యాంపులు నిర్వహించి రికార్డు స్థాపించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపులు జరిగాయి. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జనార్దన్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఒంగోలు 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.