సదాశివ పేట్: సంగారెడ్డి: ఆరూర్ వద్ద అదుపుతప్పి గుంతలో పడిపోయిన లారీ
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ వద్ద జాతీయ రహదారి-65పై లారీ బోల్తా పడింది. జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న లారీ ఫ్లైఓవర్ పక్కనున్న గుంతలో పడింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వాహనంలో పెయింట్, గుడ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.