కనిగిరి: దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలి: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు సోమవారం సాయంత్రం పీ 4 ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అందరూ సమానత్వంతో ఉండేందుకు పీ4 కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. అధికారంలో ఉన్న ,లేకున్నా పేదలకు సేవ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక నెలలో కొంతమంది పేదలకైన సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు