ఎడపల్లి మండలంలోని ఎడపల్లి సెక్టార్ కు సంబంధించిన ఓ అంగన్వాడీ కేంద్రం నుండి పిల్లలకు అందించే పౌష్టికాహారం దొంగతనంగా తరలిస్తున్న సమయంలో గమనించిన స్థానికులు వారిని పట్టుకొని నిలదీశారు.కేంద్రంలో పని చేస్తున్న అయా గంగమణి అనారోగ్యంతో బాధపడుతూ సెలవు కావాలని అధికారులను కోరినప్పటికీ సెలవు మంజూరు చేయకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా ఆమె కుటుంబీకులతో కేంద్రంలో పని చేయిస్తున్నారు.ఈ క్రమంలో కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహారం అక్రమంగా తరలించడం వెలుగుచూసింది.సుమారు 40 కిలోల బియ్యం, పాల డబ్బాలు, బాలమృతం దొంగ దారిలో తరలిస్తున్న సమయంలో స్థానికులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.