గుంటూరు: గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే: సమస్యల పరిష్కారానికి ఎస్పీ హామీ
Guntur, Guntur | Nov 13, 2026 గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. సిబ్బంది సమస్యలను విన్న ఆయన, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.