కర్నూలు: మంత్రాలయం, చట్నీహళ్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఐ
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రాలయం ఎస్ఐ మల్లికార్జున మంత్రాలయం, చట్నీహళ్లిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు మరియు ఓటర్ల వసతులపై అధికారులతో చర్చించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.