బాలాపూర్: తన పెళ్లికి ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించి, యువతి సోదరుడిని చంపిన వ్యక్తి పరార్, సంతోష్ నగర్ పిఎస్ లో కేసు నమోదు
తన కొడుకు అస్లాం మృతి చెందడానికి కారణం ఫైజల్ అనే వ్యక్తి అని మృతుడు అస్లాం తల్లి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం సంతోష్ నగర్ పీఎస్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురిని ఫైజల్ అనే వ్యక్తి ప్రేమించాడని, ఎన్నిసార్లు మందలించిన తీరు మార్చుకోలేదన్నారు. తిరిగి తన కొడుకును చంపుతానని బెదిరించాడని తన పెళ్లికి ఒప్పుకోకుంటే చంపేస్తానని బెదిరించిన కొద్ది రోజులకే హత్య చేశాడని వాపోయారు. నిందితుడు ఫైజల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా నిందితుడు ఫైజల్ పరారీలో ఉండగా అతని ఆచూకీ కోసం సంతోష్ నగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.