అశ్వారావుపేట: అశ్వారావుపేట
రెండు బైక్ లు ఢీ కొని ఒక వ్యక్తి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొన్న ఘటనలో చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన మంగళగారి శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలై రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను అంబులెన్స్ లో అశ్వరావుపేట తరలించారు. తీవ్ర గాయాలు ఇద్దరిలో వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలిస్తున్నారు . సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద #ఘటనపై దర్యాప్తు చేపట్టారు.