తిప్పర్తి: నల్లగొండలో దసరా పండుగ రోజున ఘర్షణ: కళ్ళలో కారం చల్లి గొడ్డళ్లతో దాడి
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటలో దసరా రోజున జరిగిన ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు కళ్ళలో కారం చల్లి గొడ్డళ్లతో దాడి చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న కొల్లు దుర్గయ్యను హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.