ఒంగోలు అర్బన్: ఒంగోలులో మౌలాబీ కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన తెలిపిన దళిత సంఘాల పోరాట సమితి అధ్యక్షుడు నాగేందర్రావు
Ongole Urban, Prakasam | Sep 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మౌలాలి కుటుంబానికి న్యాయం చేయాలని దళిత పోరాటాల సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏడు నెలల క్రితం సింగరాయకొండలోని ప్రైవేటు నవోదయ పాఠశాలలో విద్యార్థి తౌశిక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతి పై అనుమానం వ్యక్తం చేసిన తల్లి మౌలాబి 7 నెలలుగా న్యాయపోరాటం చేస్తుంది. రెండు రోజుల క్రితం విష ద్రవం తాగిన మౌలాబి హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధ్యత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని నాగేందర్రావు డిమాండ్ చేశారు.