యర్రగొండపాలెం: దోర్నాలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలు
ప్రకాశం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో ముస్లింలు బక్రీద్ పండగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముస్లింలు భారీ ర్యాలీగా బయలుదేరి శ్రీశైలం రహదారిలోని ఈద్గాకు చేరుకున్నారు. ఈద్గా వద్ద సామూహిక నమాజ్ నిర్వహించారు. త్యాగానికి ప్రతికగా భావించే బక్రీద్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని ముస్లిం పెద్దలు తెలిపారు.