యర్రగొండపాలెం: పుల్లలచెరువులోని పురాతన శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని పురాతన శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మూడు రోజులు పురోహితులు యజ్ఞ యాగాలు చేశారు. అనంతరం వేద పండితుల వేదమంత్రాల మధ్య శాస్రోప్తకంగా ధ్వజస్తంభ ప్రతిష్ట చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని భక్తులు పరిసర గ్రామాల నుండి ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.