యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలంలోని అన్ని గ్రామాల్లో డ్రోన్ కెమెరా ద్వారా ప్రత్యేక నిఘా: ఎస్సై అనిల్ కుమార్
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని అన్ని గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరా ద్వారా ప్రత్యేక నిఘా ఉంచడం అయినదని ఎస్సై అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో పేకాట కోడిపందాలు జూదం మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా అడ్డు వేయుటకు డ్రోన్ కెమెరా ద్వారా ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. మండలంలోని ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.