యర్రగొండపాలెం: సంవత్సరకాలం కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని విమర్శించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తాడేపల్లి లోని కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పరిపాలన పై వ్యతిరేకంగా వెన్నుపోటు దినం కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కడపలో జరిగిన మహానాడులో జనాలు లేక మీరు మాట్లాడుతున్నప్పుడు జనాలు వెళ్లిపోయిన పరిస్థితి కూడా ఉందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు లక్షలాదిమంది ప్రజలు మద్దతు తెలిపారు అంటే ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది అన్నారు.