యర్రగొండపాలెం: ఎడవల్లి గ్రామ సమీపంలో కొండపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని ఎడవల్లి గ్రామ సమీపంలో బలిజేపల్లి వెళ్లే రహదారిలో కొండపై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉందని ఎస్సై మహేష్ తెలిపారు. మృతుని వివరాల కోసం దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.