యర్రగొండపాలెం: గోవులను వధిస్తే జంతు సంరక్షణ చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపిన ఎమ్మార్వో చిరంజీవి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో ఎవరైనా బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు దూడలు ఒంటెలను వధిస్తే జంతు సంరక్షణ చట్టం 1960 ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. జంతు సంరక్షణ గోవద నిషేధ చట్టాల ప్రకారం రాష్ట్రంలో జంతువుల వద్ద పై నిషేధం ఉందని ఆయన అన్నారు. చట్టాలను గౌరవించి పైన తెలిపిన జంతువులను వధించరాదని కోరారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.