మానకొండూరు: శంకరపట్నం మండలంలో దంచి కొట్టిన వర్షం...
శంకరపట్నం మండలంలో భారీ వర్షం.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.గత రెండు రోజుల నుండి శంకరపట్నం మండలంలో వర్షం దంచి కొడుతుంది.దీంతో అక్కడ వాగులు,వంకలు,చెరువులు పొంగి పొర్లుతున్నాయి.సాయంత్రం కురిసిన వర్షానికి పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో రోడ్లపైన నీళ్లు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఖరీఫ్ సీజన్లో మొదట్లో మామూలుగా కురిసిన వర్షాలు సెప్టెంబర్లో ఊపందుకొని భారీగా కురుస్తున్నాయి.