వనపర్తి: పోలింగ్ కేంద్రాల రేష్నలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి : చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి
సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలలోని 1200 దాటిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల రేష్నలైజేషన్ పూర్తిచేయాలని జిల్లాలోని పొలిటికల్ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి పోలింగ్ కేంద్రాలను సూచించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లా వ్యాప్తంగా 316 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 38 పోలింగ్ కేంద్రాలు 1200 దాటిన వి ఉన్నాయని వాటిని రేష్నలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు.