వనపర్తి: జూన్ 12న పాఠశాలల పున ప్రారంభం పండగ వాతావరణంలో చేపట్టాలి : వనపర్తి కలెక్టర్ ఆదర్శ
సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మహిళా సాధికారత పై రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలలో మహిళా సాధికారత మరియు పాఠశాలల విద్యార్థులను అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల నమోదు పై కలెక్టర్ ను ప్రత్యేక దృష్టి సారించారని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ జిల్లాలో బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని గ్రామాలు నిర్వహించి విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడుతున్నామని అన్నారు. ఏకరూప దుస్తులు మహిళా సంఘాల ద్వారా కుట్టించడం జరుగుతుందన్నారు