వనపర్తి: వనపర్తిలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాలుగవ మహాసభలు
సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ని సిఐటియు కార్యాలయం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాలుగవ మహాసభలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పాల్గొని ప్రసంగించారు అంగన్వాడీల హక్కుల కోసం సిఐటి తో కలిసి పోరాటం కొనసాగించడం జరుగుతుందని అంగన్వాడీ టీచర్ల కోసం హెల్పర్ల కోసం అనేక హక్కులు సాధించడం జరిగిందని అన్నారు రాబోవు రోజులలో 26 వేల వేతనం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని అన్నారు. జులై 9న జరిగే లా దేశవ్యాప్త సమ్మెకు విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.