విశాఖపట్నం: విశాఖలో కాంగ్రెస్ నిరసన: జ్ఞానేష్ కుమార్ను అరెస్ట్ చేయాలంటూ ధర్నా
ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం నిరసన ర్యాలీ చేపట్టారు.