BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS *కొత్త పింఛన్లకు భారీ స్పందన...*
*5 రోజుల్లో 6.81 లక్షల దరఖాస్తులు..*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త సామాజిక భద్రత పింఛన్ల కోసం దరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుండి కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే మొత్తం 6.81 లక్షల దరఖాస్తులు అందాయి.
అందించిన వివరాల ప్రకారం, వృద్ధాప్య పింఛన్ల కోసం అత్యధికంగా 3.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వితంతు పింఛన్ల కోసం 1.65 లక్షల దరఖాస్తులు, దివ్యాంగుల పింఛన్ల కోసం 1.09 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. అదేవిధంగా, డప్పు కళాకారుల నుండి 5,655 దరఖాస్తులు అందాయి.