చోడవరం: పోలింగ్ కేంద్రం కోసం డోలీలతో గిరిజనుల నిరసన - అనకాపల్లి జిల్లాలో ఆందోళన
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం జెడ్.జోగంపేటలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని గిరిజనులు డోలీలతో నిరసన తెలిపారు. 10 గ్రామాలకు చెందిన 720 మంది ఓటర్లు 12 కిలోమీటర్లు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామంలోనే కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే రోడ్డు సౌకర్యం, రైతు భరోసా కోసం డిమాండ్ చేశారు.