గంగాధర: చొప్పదండిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం: రైతులు దళారులను నమ్మొద్దు
చొప్పదండి నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని రైతులకు సూచించారు. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు.