కొత్తగూడెం: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత!
కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం
భద్రాచలంలో కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నట్లు సమాచారం.
సుమారు 100 కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసుపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
గంజాయి ఖచ్చితమైన పరిమాణం, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు అనే పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...