పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన
పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. సీతానగరం ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు సేకరించారు. జంఝావతి సాధన సమితి ప్రతినిధులు, స్థానిక నాయకులు ఆయనకు పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.