గుంతకల్లు: గుత్తి మండల వ్యాప్తంగా ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ జెండాలను ఆవిష్కరించిన నాయకులు
అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. గుత్తి, గుత్తి అర్ఎస్, మండలంలోని తొండపాడు, వన్నెదొడ్డి, గాజులపల్లి, టి.కొత్తపల్లి, లచ్చానుపల్లి, శ్రీపురం, మాముడూరు తదితర గ్రామాల్లో ఆదివారం టీడీపీ నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు పేద, నిరుపేదల కోసం పార్టీ స్థాపించారని అన్నారు