బనగానపల్లె: మారునీళ్ల చెలిమే దేవస్థానంలో పార్వతీ పరమేశ్వరుల దివ్య దర్శనం
కార్తీక మాసం మొదటి శుక్రవారం సందర్భంగా బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని మారునీళ్ల చెలిమే దేవస్థానంలో పార్వతీపరమేశ్వరుల దివ్య దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ఆకు పూజ, కుంకుమార్చన, అభిషేకాలు చేశారు. వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు బత్తుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు.