రాజమండ్రి సిటీ: రాజమండ్రిలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీల ఏర్పాటు
రాజమండ్రి లాలాచెరువు, సంజీవ్ నగర్ ప్రాంతాల్లోని ఆలయాల వద్ద స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 300 బెంచీలు అందించామని నిర్వాహకులు రాంబాబు తెలిపారు. మాజీ కార్పొరేటర్ అజరపు వాసు చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు.