కాకినాడ సిటీ: కాకినాడ - మూలపేట రూటులో విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సు
కాకినాడ నుంచి మూలపేటకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కాకినాడ డిపో మేనేజర్ రామలక్ష్మి వెల్లడించారు. తీర ప్రాంత విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.