కాగజ్నగర్ మండలం అంకుశ పూర్ గ్రామ శివారులో పులి కదలికలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు మైకు చాటింపు ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం రాత్రి నందిగూడ, వంజీరి, బురద గూడ, గొల్లగూడ, చారిగాం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాలకు వెళితే గుంపులు గుంపులుగా వెళ్లాలని గ్రామాలలో మైకుల ద్వారా అటవీ శాఖ అధికారులు ప్రచారం చేయిస్తున్నారు. దీంతో కాగజ్ నగర్ అటవీ డివిజన్లో బయానక వాతావరణం నెలకొంది,