చివ్వెంల: ఉండ్రుగొండ గుట్టల్లో అర్ధరాత్రి తవ్వకాలు.. గుప్త నిధుల కోసమేనా?
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఉండ్రుగొండలో పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన తవ్వకాలు కలకలం రేపాయి. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.