ఒంగోలు అర్బన్: ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో పాల్గొన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Aug 15, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎస్పీ హర్షవర్ధన్ రాజు కార్యక్రమానికి హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయనతోపాటు పోలీసు సిబ్బంది కూడా జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు అర్పించడం వల్లే మనమందరం ప్రస్తుతం ఈ స్వాతంత్రం అనుభవిస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు.