ఎనిమిదేళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్ద దారుణ ఘటన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడుని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గుడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం హాస్పిటల్లో ఉండగా అతని కుమార్తెపై అదే వార్డులో మరో పేషంట్ అటెండర్ ఉన్న జమీర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అయన తెలిపారు.