మహబూబాబాద్: జిల్లాలో ప్రజారోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్ఓ కీలక సమీక్ష
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం జరిగింది. గర్భిణీల నమోదు, హెచ్.పి.వి వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధుల నియంత్రణ మరియు వైద్య సేవల మెరుగుదలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.