జనగాం: జనగామలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంచలన తీర్పు: ముగ్గురికి జైలు శిక్ష!
జనగామలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ అడిషనల్ మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. మరో 12 మందికి మొత్తం 1.20 లక్షల జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.