పాపన్నపేట్: కొత్తపల్లిలో బిజెపి మండల స్థాయి కార్యకర్తల సమావేశం
ప్రభారి ఈర్ల రంజిత్ రెడ్డి
కొత్తపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ వర్క్ షాప్ మెదక్,జూలై24(నమస్తే భారత్):భారతీయ జనతా పార్టీ(బీజేపీ)రాష్ట్ర,జిల్లా పార్టీ ఆదేశాల మేరకు గురువారం రోజు పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో పాపన్నపేట మండల స్థానిక సంస్థల ఎన్నికల కార్యాశాల (వర్క్ షాప్) కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి తెలిపారు.ఈకార్యక్రమానికి ప్రబారీగా జిల్లా నాయకులు ఈర్ల రంజిత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాబోయే స్థానిక జడ్పిటిసి, ఎంపిటిసి,సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలకు సంబంధించి సమాయత్త పరచడానికి ఈకార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింద.